Mahabubabad: ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు: డీఏవో విజయచందర్!
Mahabubabad: కేసముద్రంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావంలోనూ ఆయిల్ ఫామ్‌తో అధిక ఆదాయం పొందవచ్చని అగ్రికల్చర్ ఆఫీసర్ విజయచందర్ తెలిపారు.
Mahabubabad: ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు: డీఏవో విజయచందర్!
Mahabubabad: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరి , మిర్చి , పత్తి , మొక్క జొన్న పంటలు సాగు చేయకుండా ...ఆయిల్ ఫామ్ ను సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచందర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి గ్రామం లోని జైపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో కోరమాండల్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచందర్ మాట్లాడుతూ, దేశ అవసరాల్లో 5 శాతం ఫామ్ ఆయిల్ ను మాత్రమే ఇక్కడ పండిస్తున్నామని , మిగతా 95% దిగుమతి చేసుకుంటున్నామని , ఈ దిగుమతి కి ఒక లక్ష కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నామన్నారు.
ఈ సంవత్సరం మన జిల్లా లో 2500 ఎకరాల్లో నూతనంగా ఆయిల్ ఫామ్ ను సాగు చేయాలని నిర్ణయించామని , ఈ ఎంపిక పూర్తయిందని , ఆయిల్ ఫామ్ సాగు లో కోతుల బెడద , చీడ పీడల బెడద ఉండదని , తక్కువ పెట్టుబడి అవసరం అవుతుందన్నారు.
ఆయిల్ ఫామ్ రైతులు ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులు , సాఫ్ట్వేర్ ఉద్యోగుల మాదిరిగా వారి కంటే ఎక్కువ జీతం వస్తుందని పలువురు రైతులు సదస్సు లో తమ..తమ అనుభవాలను పంచుకున్నారు.ఈ సదస్సు లో వ్యవసాయ , ఉద్యానవన , మల్యాల కేవికే , హార్టికల్చర్ శాఖల అధికారులు , రైతులు పాల్గొన్నారు




