Mahabubabad: ఎన్హెచ్ఎం సమ్మె వేళ వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు
Mahabubabad: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవల్లో అంతరాయం కలగొద్దని మహబూబాబాద్ DMHO డాక్టర్ రవి రాథోడ్ ఆదేశం. LCDC కుష్టు సర్వే, NCD స్క్రీనింగ్‌పై సమీక్ష.
Mahabubabad: ఎన్హెచ్ఎం సమ్మె వేళ వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు
మహబూబాబాద్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ, ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. సమ్మె కాలంలో ఓపీ సేవలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు.
జిల్లాలో నిర్వహిస్తున్న *కుష్టు వ్యాధి గుర్తింపు సమగ్ర సర్వే (LCDС)* లో భాగంగా ఇంటింటి సర్వే ద్వారా చర్మంపై ఎరుపు లేదా గోధుమ రంగులో ఉండి స్పర్శజ్ఞానం తగ్గిన అనుమానాస్పద మచ్చలను గుర్తించి, సంబంధిత వ్యక్తులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించే దిశగా వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే తలసేమియా, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విషజ్వరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అసంక్రమిత వ్యాధుల (NCD) కార్యక్రమంలో భాగంగా మధుమేహం, రక్తపోటు బాధితులను గుర్తించి సకాలంలో పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు.
మహిళా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అనుమానిత కేసులను ముందుగానే గుర్తించి సంబంధిత వైద్య పరీక్షలు, తదుపరి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ అర్జున్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ విరాజితతో పాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.




