Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం. ఐదేళ్లలోపు 76,660 మంది చిన్నారుల కోసం 469 కేంద్రాల ఏర్పాటు.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు!
మహబూబాబాద్: పల్స్ పోలియో జాతీయ టీకా కార్యక్రమం – ఆదివారం 28 జూన్ 2026 మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్ 28, 2026 (ఆదివారం) నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందు వేయించాలని డా. బి. రవి రథోడ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో గల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా లో 76660 మంది 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఉన్నారని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఏర్పాటు చేసిన 469 పోలియో చుక్కల కేంద్రాలలో ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు ఉచితంగా వేయబడతాయి.
అనంతరం ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. ఇప్పటికే సాధారణ టీకాల ద్వారా పోలియో చుక్కలు తీసుకున్న చిన్నారులు కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. భారతదేశం పోలియో రహిత దేశంగా కొనసాగేందుకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం అత్యంత అవసరమని తెలిపారు.
జిల్లా లోని వైద్య సిబ్బంది ప్రతి ఒక చిన్నారి కి తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు. 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి – తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందు వేయించండి. పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కండి.




