Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్‌లో మిర్చి బకాయిల కోసం రైతు ఆత్మహత్యాయత్నం
Mahabubabad: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి బకాయిల కోసం రైతు హోలీ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. పోలీసుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం, గేటుకు తాళం వేసి ధర్నా.
Mahabubabad: మహబూబాబాద్ మార్కెట్‌లో మిర్చి బకాయిల కోసం రైతు ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ లో మిర్చి అమ్మిన రైతులకు డబ్బులు ఇవ్వాలంటూ ఓ రైతు వంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ ఎదుట చోటుచేసుకుంది.
మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్ , వైస్ చైర్మన్ మదన్ ఎస్.ఐ ఉమ సిబ్బంది పెట్రోల్ బాటిల్ పట్టుకొని రైతు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. డబ్బులు రావలసిన రైతులు వ్యవసాయ మార్కెట్ వద్దకు చేరుకొని మార్కెట్ కార్యాలయం మరియు గేట్ కు తాళం వేసి ధర్నా చేపట్టారు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ ఉమా సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకొని రైతులు... వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా రైతు హోలీ వంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డాడు.నాకు 3 లక్షల 10 వేల రూపాయలు రావాలని నాకు ఆత్మహత్యయత్నం తప్ప మరో మార్గం లేదని రైతు హోళీ వాపోయాడు. అ రైతుకు పోలీసులు స్నానం చేపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఎన్.ఎస్ ట్రేడర్ వ్యాపారి లాలు రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేశాడు. ఆ వ్యాపారికి కొన్ని ఇబ్బందుల తో రైతులకు రెండు కోట్ల మేర బకాయి పడ్డాడు. వాయిదాల ప్రకారం చెల్లిస్తూ 1 కోటీ 80 లక్షలు చెల్లించగా , ఇంకా 9 మంది రైతులకు 20 నుంచి 30 లక్షల రూపాయలు బకాయి చెల్లించవలసి ఉంది.
వ్యాపారి , మార్కెట్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన రైతులు ఈ రోజు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం మరియు గేట్ కు తాళం వేసి ధర్నా చేపట్టారు. ఈ విషయం మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ....రైతులకు మిగతా పైసలు కూడా త్వరలో ఇప్పిస్తామని , రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని , సంయమనం పాటించాలని కోరారు.




