Gudur: గూడూరు లో ఎల్ నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో రైతులకు ఉద్యాన పంటల యాజమాన్యంపై శిక్షణ. వరి కాకుండా కూరగాయల పంటలు సాగు చేయాలని కోరిన కలెక్టర్ స్నేహ శబరీష్.

B NARASIMHA, GUDUR
Published on: 10 Nov 2026 12:27 PM IST
Gudur
X

Gudur: గూడూరు లో ఎల్ నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట రైతు వేదికలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో "ఎల్ నినో పరిస్థితులలో ఉద్యాన పంటల యాజమాన్యం"పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎల్ నినో పరిస్థితులను తట్టుకుని రైతులు ఉద్యాన పంటలలో అధిక దిగుబడులు సాధించేందుకు తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ, నీటి నిల్వ పద్ధతులు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.

ఎప్పుడూ వరి పంట ను కాకుండా వివిధ రకాల కూరగాయల పంటను రైతులు సాగు చేయాలని అన్నారు.ఈ పంటల సాగు తో అధిక దిగుబడి తో అధిక లాభాలు రైతులు పొందవచ్చు అని, విద్యుత్ ఆదా తో పాటు నీటిని కూడా ఆదా చేయవచ్చు అని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​ఈ శిక్షణ కార్యక్రమంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు భూపతిపేట పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR