Mahabubabad: కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా: ఐకేపీ కేంద్రంలో అక్రమాలు.. క్వింటాకు 3 కిలోల తరుగుపై ఆగ్రహం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామ రైతుల భారీ ఆందోళన. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అదనపు తరుగు, లంచాల డిమాండ్‌పై విచారణ జరపాలని బాధితుల డిమాండ్.

A.Rajkumar, Mahabubabad
Published on: 8 Jun 2026 6:55 PM IST
Mahabubabad
X

Mahabubabad: కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా: ఐకేపీ కేంద్రంలో అక్రమాలు.. క్వింటాకు 3 కిలోల తరుగుపై ఆగ్రహం!

Mahabubabad: ఐకేపపీ కొనుగోలు కేంద్రంలో దాన్యం కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు అరికట్టాలంటూ,మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మరిపెడ మండలం తాళ్ళ ఊకల్ గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. ఐకేపీ కొనుగోలు కేంద్ర నిర్వాహకుల పై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా బాధిత రైతు సతీష్ మాట్లాడుతూతాళ్ళ ఊకల్ గ్రామ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో దాన్యం కొనుగోలు ప్రక్రియలో తేమ తరుగు పేరిట క్వింటాకు ఆధనంగా మూడు కిలోలకు పైగా దాన్యం తీసుకోవడమే గాకుండా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి నిర్వహకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వని రైతుల దాన్యం బస్తాలను తూకం వేయకుండా జాప్యం చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేపట్టి ఐకేపీ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story