Mahabubabad: షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు రూ. 6 లక్షల ఆస్తి నష్టం
Mahabubabad: మహబూబాబాద్ మండలం రేగడి తండాలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు. రూ. 6 లక్షల ఆస్తి నష్టం, తప్పిన ప్రాణాపాయం.
Mahabubabad: షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు రూ. 6 లక్షల ఆస్తి నష్టం
మహబూబాబాద్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ తో ఓ ఇంట్లోని నగదు , వెండి , బంగారు ఆభరణాలు , గృహోపకరణాలు దగ్గమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం రేగడి తండా లో అర్ధరాత్రి చోటుచేసుకుంది. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తండాకు చెందిన భూక్యా నరేష్...అఖిల వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుoది.
నరేష్ కూరగాయలు అమ్ముకునేందుకు ఖమ్మం మార్కెట్ కు వెళ్లగా , అఖిల చిన్న పాప తో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇంట్లో మంటలు చెలరేగినప్పుడు అరుబయట నిద్రిస్తుండటం తో ప్రాణ నష్టం తప్పింది.
దుస్తులు తప్పా మరేమి మిగల లేదని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో రేగడి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం , అధికారులు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానిక తండా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




