Mahabubabad: వేరుకుళ్లు తెగులుతో ఎండుతున్న మిర్చి తోటలు.. రైతుల ఆవేదన!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మంగం తండాలో మిర్చి తోటలకు వేరుకుళ్లు తెగులు సోకి ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతూ పొలాల్లో తాటి మట్టలు పాతుతున్నారు.
Mahabubabad: వేరుకుళ్లు తెగులుతో ఎండుతున్న మిర్చి తోటలు.. రైతుల ఆవేదన!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీలోనీ మంగం తండా గ్రామంలోని మిర్చి రైతులు మాట్లాడుతూ... మిర్చి తోటలో ఏరు కుళ్ళు రోగంతో తోట ఎండిపోతున్నాయని, ఎన్ని మందులు పిచికారి చేసిన ఫలితాలు ఆగిపోవడంతో, మిర్చి తోటలో తాటి మట్టలు పెడుతున్నామని, తాటి మట్టలు పెట్టినందుకేనా మాపైన దేవుడు కరుణిస్తాడేమో అని రైతులు ఆవేదన.
వేలకు వేలకు అప్పు తీసుకొచ్చి పెట్టామని పిందలు, పడే టైం లో ఇలా కావడం మా అదృష్టమని మా రైతుల పైన దేవుడు కనికరించడం లేదని చివరికి నోటి కాడికి వచ్చి టైం లో ఇలా ఏరు కుళ్ళు రోగంతో ఏమి చేయాలో అర్థం కావట్లేదని, అప్పు తెచ్చి చోటా ఎలా అప్పులు కట్టాలో అర్థం కావట్లేదని, తోటను చూస్తుంటే దుఃఖం ఆగటం లేదని, ఇప్పటికే లక్షన్నర రూపాయలు తోటకు ఖర్చు వచ్చిందని, ఇలా తాటి మట్టలు పెట్టినందుకేనా తోట ఆగుతుందని నమ్మకంతోనే పెట్టామని అన్నారు.
సంబంధించిన అధికారులు ఏరు కుళ్ళు రోగంపై మా రైతులకు తగిన సలహాలు, సూచనలు , సంబంధించిన మందులు గురించి తెలియజేయాలని కోరుకోవడం జరిగింది.




