Mahabubabad: విధి నిర్వహణలో ఎస్బీఐ ఉద్యోగి మృతి.. భార్యకు ఉద్యోగమివ్వాలి!

Mahabubabad: గార్ల ఎస్బీఐలో విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన ఉద్యోగి అశోక్ కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది.

NARASIMHARAO, BAYYARAM
Published on: 19 Oct 2026 6:36 PM IST
Mahabubabad
X

Mahabubabad: విధి నిర్వహణలో ఎస్బీఐ ఉద్యోగి మృతి.. భార్యకు ఉద్యోగమివ్వాలి!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గార్లమండల కేంద్రం లోని ఎస్.బి.ఐ బ్యాంక్ లో విధులు నిర్వహిస్తూ గుండె పోటుతో మృతి చెందిన బ్యాంక్ ఉద్యోగి వై.అశోక్ కుటుంబాన్ని ఆదుకోవాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు.

35 సంవత్సరాల చిన్న వయసులోనే బ్యాంకులో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో ఆకస్మికంగా తీవ్ర గుండెపోటుతో మరణించడం విషాదకరమన్నారు. మృతుడికి భార్య,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

పేద కుటుంబానికి చెందిన బ్యాంకు ఉద్యోగి అశోక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని, భార్యకు బ్యాంకులో ఉద్యోగం ఇచ్చి అశోక్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.మృతుడు అశోక్ కుటుంబానికి ప్రగాఢ సంతాప సానుభూతిని సిపిఎం మండల కమిటీ.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM