Gudur: గూడూరులో చిరుత కలకలం: అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తింపు. రైతులు, ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాద్ రావు హెచ్చరిక.

B NARASIMHA, GUDUR
Published on: 12 July 2026 5:01 PM IST
Gudur
X

Gudur: గూడూరులో చిరుత కలకలం: అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించిన పాదముద్రలు ప్రాథమికంగా చిరుతపులివేనని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి (FRO) ప్రసాద్ రావు తెలిపారు.

రైతులు అందించిన సమాచారం మేరకు మండల కేంద్ర సమీపంలోని కోడి చెరువు ప్రాంతంలో శనివారం సాయంత్రం సాయంత్రం 7 గం. ప్రాంతంలో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఏపుగా పెరిగిన జీలుగా మొక్కలలో ఏదో శబ్దం చేస్తూ జంతువు కదిలినట్లు గమనించాడు. భయపడిన రైతు ఆదివారం ఉదయం మరికొందరు రైతులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లగా ఓ జంతువు పాదముద్రలు చూసి మాకు (ఫారెస్ట్ అధికారులు) తెలియజేయడంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులికి చెందినవేనని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిరుత కనిపించినా, అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

అటవీశాఖ సిబ్బంది పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story