Mahabubabad: మరిపెడలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం!
Mahabubabad: మహబూబాబాద్ మరిపెడలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ ఈ.డబ్ల్యూ. వేణుగోపాల్ ప్రారంభించి స్థానికంగా న్యాయ సేవలు హర్షనీయమన్నారు.
Mahabubabad: మరిపెడలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి మరియు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ ఈ.డబ్ల్యూ. వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు భవనాన్ని ప్రారంభించి న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
మరిపెడ ప్రాంత ప్రజలకు స్థానికంగానే న్యాయ సేవలు అందుబాటులోకి రావడంతో కేసుల పరిష్కారానికి సౌలభ్యం కలగనుంది. కార్యక్రమంలో న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




