Mahabubabad: మానుకోటలో జెండా ఎగురవేసిన విప్ రామచంద్రు నాయక్!
Mahabubabad: మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు.
Mahabubabad: మానుకోటలో జెండా ఎగురవేసిన విప్ రామచంద్రు నాయక్!
Mahabubabad: 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియం లో ప్రభుత్వ విప్.డాక్టర్.రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి , గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , ఎస్పీ శబరీష్ , ఎం.పి బలరాం నాయక్ , ఎమ్మెల్యే డాక్టర్.మురళీ నాయక్ , స్వాతంత్ర్య సమర యోధులు, జిల్లా అధికారులు , విద్యార్థులు , పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్.మాట్లాడుతూ....తెలంగాణ రైజింగ్..2047 పేరుతో పేదల సంక్షేమం , సమగ్ర పాలసీల రూపకల్పన , ప్రపంచ స్తాయి ఇన్ఫ్రా డెవలప్ మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాల సాధనకు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ , ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ , టూరిజం పాలసీలను సిద్ధం చేసిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా 4 వ స్థానంలో ఉందని , భూ భారతి చట్టం ద్వారా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం లో రీ సర్వే విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.




