Mahabubabad: కందికొండలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కందికొండలో సర్పంచ్ తొడ్సు నాగార్జున చొరవతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.

P PRABHAKAR, DORNAKAL
Published on: 5 Sept 2026 8:01 AM IST
Mahabubabad
X

Mahabubabad: కందికొండలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు!

Mahabubabad: కందికొండ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ తొడ్సు నాగార్జున స్వయంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కృష్ణాష్టమి ఉత్సవాలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు.

గడిచిన నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎవరూ నిర్వహించకపోవడంతో, ఈసారి సర్పంచ్ నాగార్జున చొరవ తీసుకుని ముందే ఉండి ఉత్సవాలను విజయవంతం చేయడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్పంచ్ కు గ్రామ ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story