Kesamudram: కృష్ణాష్టమి వేడుకల్లో చిందేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్!

Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ర్యాలీలో నృత్యం చేసి, ఉట్టి ఉత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 5 Sept 2026 8:07 AM IST
Kesamudram
X

Kesamudram: కృష్ణాష్టమి వేడుకల్లో చిందేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్!

Kesamudram: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కేసముద్రం మండల కేంద్రం లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎంపి , అఖిల భారత యాదవ సంఘం జాతీయ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ పాల్గొని నృత్యం చేశారు.

డప్పు చప్పుళ్ళు , మహిళల కోలాటాలతో బోనం నెత్తిన పెట్టుకొని నిర్వహించిన ర్యాలీ లో పాల్గొని ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని , మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల పక్షాన ఉందని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల వైపు ఉన్నాడని , పాడి పంటలు బాగా పండాలని , ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ కృష్ణ భగవానుడిని వేడుకుంటున్నానని తెలిపారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story