Mahabubabad: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా!
Mahabubabad: పెండింగ్ బిల్లులు విడుదల చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రీసర్వే విధులను బహిష్కరించిన సర్వేయర్లు మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
Mahabubabad: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా!
మహబూబాబాద్ జిల్లా: తమ సమస్యలు పరిష్కరించి... పెండింగ్ బిల్లులు విడుదల చేసీ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రీసర్వే విధులను బహిష్కరించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సర్వేయర్లు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా లైసెన్స్ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెంకన్న మాట్లాడుతూ ... ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున రీ సర్వే పనులు పూర్తి చేసే నెలలు గడుస్తున్నా తమకు ఇప్పటివరకు నిధులు కాకపోవడంతో సర్వేయర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే విధుల్లో భాగంగా దూర ప్రాంతాలకు ప్రయాణించడం ప్రమాదకర ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు.
సర్వేయర్ లకు కష్టమైన చెల్లింపు విధానం ప్రకటించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఉపాధి అవకాశాలు కల్పించి, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారుఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా లైసెన్స్ సర్వేయర్లు పాల్గొన్నారు.




