Mahabubabad: వర్షాల కోసం భీముని పాదం జలపాతం వద్ద వినూత్న పూజలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండా గ్రామస్తుల వినూత్న పూజలు.

B NARASIMHA, GUDUR
Published on: 26 Jun 2026 10:29 AM IST
Mahabubabad
X

Mahabubabad: వర్షాల కోసం భీముని పాదం జలపాతం వద్ద వినూత్న పూజలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మండల పరిధిలోని లైన్ తండా గ్రామస్తులు వినూత్న పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన భీముని పాదం జలపాతం వద్ద లైన్ తండా గ్రామ సర్పంచ్ మానస నరేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి జలదేవతకు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మానస నరేష్ మాట్లాడుతూ ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడాలని, తద్వారా అటు వ్యవసాయ పనులు ఊపందుకొని, ఇటు తాగునీటి ఎద్దడి తప్పాలని జలపాతం వద్ద మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. గ్రామం మొత్తం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో లైన్ తండా గ్రామ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, రైతులు, మహిళలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాల కోసం భీముని పాదం జలపాతం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story