Maripeda: లచ్చి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: దంపతుల దుర్మరణం!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్చి తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు సామ, పద్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 11 Nov 2026 4:20 PM IST
Maripeda
X

Maripeda: లచ్చి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: దంపతుల దుర్మరణం!

మరిపెడ, నవంబర్ 11: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్చి తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులను లచ్చి తండాకు చెందిన బానోత్ సామ (45), పద్మ (40)గా గుర్తించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL