Mahabubabad: దళారుల వద్ద విత్తనాలు కొని మోసపోవద్దు.. ఎమ్మెల్యే పిలుపు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ‘విత్తన మేళా’ను ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు.
Mahabubabad: దళారుల వద్ద విత్తనాలు కొని మోసపోవద్దు.. ఎమ్మెల్యే పిలుపు!
Mahabubabad: రైతులు ఐఎస్ఐ బ్రాండ్ విత్తనాలనే కొనుగోలు చేయాలని.... తక్కువ ధరకే వస్తున్నాయని దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని ఎమ్మెల్యే మురళీ నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించి విత్తన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రైతు భరోసాకే పరిమితం చేశారని , పని ముట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్న దాన్యం వేసిన రైతులకు క్వింటాల్ కు 500 ల రూపాయలు ఇస్తుందని గుర్తు చేశారు. రైతులు క్రిస్టల్ యూరియా ని బాగా వాడుతుండడంతో భూసారం తగ్గిపోతుందని, క్రిస్టల్ యూరియాకు బదులు నానో యూరియాని వాడాలని, నానో యూరియాతో భూసారం తగ్గదని,
క్రిస్టల్ యూరియా లాగానే పని చేస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులంతా నానో యూరియాను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ,రైతులు పాల్గొన్నారు.




