Mahabubabad: బీజేపీ ఓటు చోరీ దందా చేస్తోంది.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

Mahabubabad: ఓటు చోరీ కాకుండా చూసుకోవడం ఓటర్ల బాధ్యత అన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే. తహసీల్దార్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఫారాల అందజేత.

A.Rajkumar, Mahabubabad
Published on: 1 July 2026 4:38 PM IST
Mahabubabad
X

Mahabubabad: బీజేపీ ఓటు చోరీ దందా చేస్తోంది.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తహసీల్దార్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్ ప్రక్రియ అప్లికేషన్ ఫారం ను ఎమ్మెల్యేకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బిజెపి దొడ్డి దారిలో అధికారాన్ని చేజి క్కించుకునేందుకు ఓటు చోరీ దందా చేపట్టి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు పన్నాగం పన్నుతోందని, ముస్లిం మైనార్టీ, బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తుందని ఆరోపించారు.

ఓకే ఇంటిపై 35 నుంచి 40 ఓట్లు ఉన్నాయని, ఓటు చోరీ కాకుండా చూసుకోవడం ప్రతి ఓటర్ బాధ్యత అని అన్నారు. జులై 3 వరకు బిఎల్ వి లు ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లకు సర్ ప్రక్రియ ఫారాలను అందజేస్తారని, తప్పులు లేకుండా ఆ ఫారాలను నింపి జూలై 24 వ తేదీ వరకు గడువు ఉన్నా ముందుగానే అందజేయాలని కోరారు. ముందుగా అందజేస్తే తప్పులు తెస్తాయని , తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story