Mahabubabad: మహబూబాబాద్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకారం
Mahabubabad: మహబూబాబాద్ జర్నలిస్ట్ కాలనీలో రూ. 2 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్. జర్నలిస్టులకు భోగభాగ్యాలు.
Mahabubabad: మహబూబాబాద్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి సహకారం
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 19వ వార్డులోని జర్నలిస్ట్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ కాలనీకి రెండులక్షల రూపాయల అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్ ప్రతీ క్షణం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులు వారి కుటుంబాల నివాసం ఉన్న ప్రాంతం అభివృద్ధికి సహకరించడం.
తమ భాద్యతగా భావిస్తున్నామని భవిష్యత్ లో కూడా ఈ కాలనీ అభివృద్ధికి కంకణ బద్దులమై ఉన్నామని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ ప్రభుత్వం, ఎమ్మెల్యే డా. భూక్య మురళీ నాయక్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమం ప్రజలకు చేరేలా ప్రచారం, కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఈ పనుల పరిశీలనకు వచ్చిన కాంగ్రేస్ జిల్లా నేతలు గుగులోత్ రమేష్ నాయక్, పద్మం ప్రవీణ్ కుమార్ ల పుట్టినరోజు వేడుకలు జర్నలిస్ట్ ల మధ్య జరుపుకున్నారు.
కార్యక్రమంలో పంధొమ్మిదవ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్, కాంట్రాక్టర్ సురేష్ నాయక్ జర్నలిస్టులు, jcws అధ్యక్షులు కె.రమేష్, ప్రధాన కార్యదర్శి, శ్రవణ్, కోశాధికారి ప్రవీణ్, గౌరవ అధ్యక్షులు రంగా, ఉదయ్, చందు, మురళి జర్నలిస్ట్లు, రాజ్ కుమార్, జ్ఞానేశ్వర్, మహేష్, కుమార్, కిరణ్, విజయ్, సతీష్, శివ రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.




