Mahabubabad: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్‌కు డిమాండ్!

Mahabubabad: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో మహబూబాబాద్ వివేకానంద సెంటర్‌లో ధర్నా.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 23 July 2026 3:53 PM IST
Mahabubabad
X

Mahabubabad: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్‌కు డిమాండ్!

Mahabubabad: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని... నీట్ పరీక్షను నిర్వహించిన ఎన్.టి.ఏ సంస్థను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని వివేకానంద సెంటర్ లో పి.డి.ఎస్.యు అధ్వర్యం లో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.....నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో తెలుపుతున్న విద్యార్థులపై లాఠీలు జులులిపించడం , లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఈడ్చుకుంటూ అరెస్టు చేయడం వంటి సంఘటనలు దేశంలో చీకటి కోణంగా మిగులుతోందన్నారు. నీట్ లీకేజీకి కారుకులైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story