Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ముమ్మరంగా నాటుసారా వ్యతిరేక తనిఖీలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల తండాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి, గుడుంబా స్థావరాలపై దాడులు చేసి బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

B NARASIMHA, GUDUR
Published on: 1 Oct 2026 9:18 AM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ముమ్మరంగా నాటుసారా వ్యతిరేక తనిఖీలు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు గురువారం గూడూరు మండలం పరిధిలోని రాములుతండా, చిర్రకుంట తండా గ్రామ పంచాయతీలలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డెన్ సెర్చ్ (తనిఖీలు) నిర్వహించారు.

గూడూరు సిఐ వినయ్ కుమార్, ఎస్సైలు రమేష్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తండాల్లో అంగుళమంగుళం తనిఖీలు చేపట్టాయి. ఈ శోధనల్లో పలు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం పానకాన్ని, గుడుంబా బాటిళ్లను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా సిఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ... గ్రామాలు, తండాలలో గుడుంబా కాచినా, విక్రయించినా సహించేది లేదని హెచ్చరించారు. అక్రమంగా గుడుంబా వ్యాపారం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాటుసారా రహిత సమాజం కోసం ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, సమాచారం అందించాలని కోరారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR