Mahabubabad: మహబూబాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా మార్చాలి!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో 5K రన్. సమాచారం అందించిన వారికి ₹5000 బహుమతి ప్రకటించిన ఎస్పీ శబరీష్.
Mahabubabad: మహబూబాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా మార్చాలి!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శభరీష్ పిలుపునిచ్చారు.డ్రగ్స్ నిర్మూలన , దుష్పరిణామాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు పోలిసుల ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణం లో 5 కే రన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంవత్సరం నుంచి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని , గంజాయి రవాణా , సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని , సమాచారం అందించిన వారికి 5000 వేల రూపాయలు బహుమతి ఇవ్వనున్నామని , వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. 5 కే రన్ లో విజేతలకు ఎస్పీ బహుమతులను ప్రధానం చేశారు.ఈ 5 కే రన్ లో ఎమ్మెల్యే డాక్టర్. మురళీ నాయక్ , ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు , మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, పలువురు కౌన్సిలర్లు , డీఎస్పీ లు, సీ.ఐ లు, ఎస్. ఐ లు, పోలీస్ సిబ్బంది , విద్యార్థులు , యువతీ , యువకులు పాల్గొన్నారు.




