Maripeda: రేఖ్యతండాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

Maripeda: మరిపెడ మండలం రేఖ్యతండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 30 Sept 2026 10:24 PM IST
Maripeda
X

Maripeda: రేఖ్యతండాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రేఖ్యతండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా తయారీకి పాల్పడుతున్న నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుడుంబా, నాటుసారా తయారీ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL