Gudur: గూడూరు 20 కిలోల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్ట్

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో రూ. 10.44 లక్షల విలువైన 20.898 కిలోల గంజాయి స్వాధీనం. ఒడిశా నుండి గుజరాత్‌కు తరలిస్తుండగా పట్టుబడిన ఇద్దరు నిందితులు.

B NARASIMHA, GUDUR
Published on: 14 July 2026 7:00 PM IST
Gudur
X

Gudur: గూడూరు 20 కిలోల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్ట్

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. బి. గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, పంచుల సమక్షంలో మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో తరలిస్తున్న 20.898 కిలోల గంజాయి బయటపడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 10,44,900/- ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

అరెస్ట్ అయిన నిందితుల వివరాలు

గురు లోకనాథ్ పాత్రా (39), నివాసం: షాపూర్, సూరత్, గుజరాత్.ఇజ్రాయిన్ ఖాసిం సంద్వాని (32), నివాసం: పుల్వాడి, సూరత్, గుజరాత్.

ఒడిశా టు గుజరాత్.. వయా తెలంగాణ

పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నిందితులు ఒడిశా రాష్ట్రంలోని బెరహంపూర్ ప్రాంతం నుండి ఈ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దానిని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి అక్రమంగా తరలించి, అక్కడ ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ప్లాన్‌తో రవాణా చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సాగ్రిగ్రి:

పోలీసులు నిందితుల నుండి 20.898 కిలోల గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన 3 బ్యాగులు, మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులపై NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్.ఐ. గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story