Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభమైన ప్రజావాణి
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి ప్రారంభం. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల వెల్లడి.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభమైన ప్రజావాణి
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల లోని మండల పరిషత్ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని శాఖల అధికారులు ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యాలయం ఎదుట హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమం పై మహబూబాబాద్ మండల పరిషత్ అధికారి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.... ప్రజావాణి కార్యక్రమం లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు వెంటనే పంపిస్తున్నామని , మండల అధికారుల పరిధి లోని సమస్యలను 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని , మా పరిధిలో లేని సమస్యలను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు.
30 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని , మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని సమస్యలకు కూడా మండల పరిషత్ కార్యాలయం ప్రజావాణి లో ఫిర్యాదు చేయాలని మున్సిపల్ పరిధి లోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




