Mahabubabad: తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలి రైతుల డిమాండ్
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతులు విలవిలలాడుతున్నారు.
Mahabubabad: తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలి రైతుల డిమాండ్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి ఈదురు గాలులు , ఉరుములు , మెరుపులతో కురిసిన వర్షానికి మామిడి కాయలు నేల రాలిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించడంతో రైతులు ముందు జాగ్రత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు , కల్లాల లోని ధాన్యం రాశుల పై టార్ఫాలిన్లు కప్పి ఉంచుకున్నారు. అయినా వర్షం నీరు క్రింది నుంచి చేరి ధాన్యం పాక్షికంగా తడిసిపోయాయి. కొన్ని చోట్ల గాలి దుమారానికి టార్పాలిన్ లు లేచిపోవడం తో ధాన్యం రాశులు తడిసిపోయాయి.
కొనుగోలు కేంద్రాల్లో మ్యాచ్చర్ రావడం లేదని , కాంటాలు అయిన వారు కూడా లారీలు రాకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని , గతంలో పంటలు సరిగా పండ లేదని , ఇప్పుడు పండిన పంటలను అమ్ముకునేందుకు నెలల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని , ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని , తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర తో కొనుగోలు చేయాలని , నష్టపోయిన మామిడి రైతులకు నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.




