Garla: మహబూబాబాద్ జిల్లా గార్లలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళులు

Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులర్పించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 31 Oct 2026 3:40 PM IST
Garla
X

Garla: మహబూబాబాద్ జిల్లా గార్లలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళులు

మహబూబాబాద్ జిల్లా: గార్ల మండల కేంద్రంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని ఉక్కు మహిళ భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను ఘన నివాళులు అర్పించారు.

వర్ధంతి కార్యక్రమంలో జాతీయ శ్రీ శక్తి అవార్డు గ్రహీత జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శంషాద్ బేగం , గార్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతి హతిరాం నాయక్ లు పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ..భారత దేశంలో గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలందరికీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టి ముందుకు నడిపించారు భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలను చేపట్టినారని, దేశం కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు పనిచేసరని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పళ్ళ నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ హతిరాంనాయక్, గోపాలపురం ఉపసర్పంచ్ ఎర్రగడ్డ శ్రీనివాస్ గార్ల మేజర్ పంచాయతీ వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్ ,పఠాన్ ఇమ్రాన్ ఖాన్, రవినాయక్, భుక్య సర్వేశ్ నాయక్, నరేశ్ తదితరులు ఘన నివాళులు అర్పించారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM