Mahabubabad: మృత్యువు అంచున రిటైర్డ్ ఆర్మీ జవాన్.. దేవతలా కాపాడిన సీఐ అంజలి!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి వద్ద భారీ ప్రమాదం! గాలివాన ధాటికి గోతిలో పడ్డ కారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 8 May 2026 7:45 AM IST
Mahabubabad
X

Mahabubabad: మృత్యువు అంచున రిటైర్డ్ ఆర్మీ జవాన్.. దేవతలా కాపాడిన సీఐ అంజలి!

మహబూబాబాద్ జిల్లా: కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామీణ సీఐ అంజలి అప్రమత్తంగా స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం, బోంకూరి వెంకటేశ్వర్లు (47), రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది, ప్రస్తుతం హైదరాబాద్‌లోని పేట్లబుర్జ్‌లో ఎస్‌పీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన జెల్లచెరువు నుండి మహబూబాబాద్ వైపు స్విఫ్ట్ డిజైర్ కారు (TS04 FE 4279)లో ప్రయాణిస్తుండగా, కురవి శివారును దాటిన కొద్దిసేపటికే భారీ గాలివాన కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొని పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. ఆ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న రూరల్ సీఐ అంజలి గారు, పోలీసు సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న వెంకటేశ్వర్లును సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. అనంతరం ఆయనను సురక్షితంగా తన బావమరిది ఇంటికి పంపించారు.

ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లుకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. అయితే వాహనం మాత్రం దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సహాయక చర్యల్లో పోలీసు సిబ్బంది రమేష్, వీరన్న, సంపత్, విజయ్ పాల్గొన్నారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలను కాపాడిన రూరల్ సీఐ అంజలి తన సిబ్బందిని స్థానికులు అభినందించారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story