Serole: సీరోల్లో ఇంటి తాళం తీసి దొంగతనం ఇద్దరు మహిళల అరెస్ట్!
Serole: సీరోల్ మండలంలో ఇంటి తాళం పగలగొట్టి ఇత్తడి బిందెలు, వస్తువులు చోరీ చేసిన ఇద్దరు మహిళలను సీరోల్ ఎస్ఐ అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Serole: సీరోల్లో ఇంటి తాళం తీసి దొంగతనం ఇద్దరు మహిళల అరెస్ట్!
సీరోల్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల పరిధిలో ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళలను సీరోల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ నెల 13వ తేదీన ముడుసు సుమన్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన ఇద్దరు మహిళలు, ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇంట్లో ఉన్న మూడు ఇత్తడి బిందెలతో పాటు ఇతర వంట సామగ్రిని దొంగిలించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీరోల్ ఎస్ఐ చాకచక్యంగా వ్యవహరించి, చోరీ జరిగిన మరుసటి రోజే నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకుని, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు:
1. గోపగాని లక్ష్మి — ఎల్లంపేట.
2. నాగిళ్ల మంగమ్మ — కూడకూడ, సూర్యాపేట.




