Garla: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్జీఐఏ ఏజీఎం వెంకన్న ఆర్థిక సాయం
Garla: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న పుస్తకాలు, క్రికెట్ కిట్లు, టీషర్టులను పంపిణీ చేశారు.
Garla: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్జీఐఏ ఏజీఎం వెంకన్న ఆర్థిక సాయం
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురం గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు , క్రికెట్ కిట్లు , టీషర్టు లను పంపిణీ చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న..
అంతేకాకుండా విద్యార్థులకు అన్ని విషయాల్లో పరిజ్ఞానం కోసం పాఠశాల లైబ్రరీ లో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. గ్రామంలోని యువకులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు అవసరమైన మెటీరియల్ ను అందిస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరు సమాజం కోసం ఎంతో కొంత సేవా చేయాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Next Story




