Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా శ్రావణ బోనాల పండుగ

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో శ్రావణ మాసంలో బోనాల పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ముత్యాలమ్మకు బోనాలు సమర్పించిన కేసముద్రం మున్సిపల్ చైర్‌పర్సన్ సునీత.

A.Rajkumar, Mahabubabad
Published on: 16 Aug 2026 8:48 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా శ్రావణ బోనాల పండుగ

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులో బోనాల పండుగను ఆషాడ మాసం లో జరుపుకోగా మహబూబాబాద్ జిల్లా లో శ్రావణ మాసంలో బోనాల పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

మహిళలు కొత్త కుండలకు పసుపు , కుంకుమ బొట్లు తో అలంకరించి , వేప ఆకులు కట్టి , ప్రసాదాలను కుండలో పెట్టి మేళ...తాళాలతో ఆ బోనాలు నెత్తి పై పెట్టుకుని నృత్యాలు చేస్తూ పోతరాజు విన్యాసాలు బేతాళుడు, కాళికామాత వేషధారణలతో విన్యాసాలు చేసుకుంటూ శోభా యాత్ర గా ముత్యాలమ్మ దేవాలయాల ప్రాంగణాలకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

కేసముద్రం మున్సిపాలిటీ లో మున్సిపల్ చైర్ పర్సన్ సునీత, వైస్ చైర్మన్ అల్లం రమ లు బోనమెత్తి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ముత్యాలమ్మ గుడికి చేరుకొని బోనం సమర్పించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. పోత రాజులు , వివిధ కళా రూపాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story