Mahabubabad: డ్రగ్స్‌కు దూరంగా.. లక్ష్యాలకు దగ్గరగా.. ఎస్పీ శబరీష్

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ‘ప్రజా పాలన 99 రోజుల ఉత్సవాల’ సందర్భంగా నిర్వహించిన 2కే రన్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రారంభించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 18 May 2026 5:42 PM IST
Mahabubabad
X

Mahabubabad: డ్రగ్స్‌కు దూరంగా.. లక్ష్యాలకు దగ్గరగా.. ఎస్పీ శబరీష్

Mahabubabad: యువత మాదకధ్రవ్యాల (డ్రగ్స్) బారిన పడకుండా ఆత్మ విశ్వాసంతో ఒత్తిడి తట్టుకొని తమ లక్ష్యాల పై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యక్రమంలో భాగంగాజిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే మారధాన్ రన్ ను జెండా ఊపి జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రీడా, సంస్కృతి, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, దేశభక్తిని పెంపొందించేందుకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నమన్నారు.

తెలంగాణలోని యువత ఆరోగ్యంగా ఉండాలానే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2 కే రన్ ను ఏర్పాటు చేశామని, 2కే రన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, జిల్లా క్రీడా అధికారిని జ్యోతి,డిఎస్పీ తిరుపతి రావు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story