Mahabubabad: గంజాయి తాగితే నిమిషాల్లో దొరికేస్తారు.. ఎస్పీ హెచ్చరిక

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ఎస్పీ శబరిష్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా.

A.Rajkumar, Mahabubabad
Published on: 4 Jun 2026 2:43 PM IST
Mahabubabad
X

Mahabubabad: గంజాయి తాగితే నిమిషాల్లో దొరికేస్తారు.. ఎస్పీ హెచ్చరిక

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ శబరిష్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. మొదట మహబూబాబాద్ జిల్లా లోని ప్రతి మండలం నుంచి రెండు గ్రామాలను దత్తత తీసుకొని గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని , దీనిని ఆదర్శంగా తీసుకొని జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గంజాయి సేవించిన వారిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ గంజాయి డిటెక్షన్ కిట్లను రంగంలోకి తీసుకచ్చిందని,

ఈ గంజాయి డిటెక్షన్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించారని , వీటి ద్వారా కేవలం నిమిషాల్లోనే వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అని నిర్ధారణ చేయవచ్చన్నారు. గంజాయి రహిత జిల్లా గా మార్చేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని, గంజాయి సమాచారం అందించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి రవాణా చేసినా, సేవించి నా కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశం లో డీఎస్పి లు తిరుపతిరావు , కృష్ణ కిషోర్ , సీ.ఐ లు రఘుపతి రెడ్డి, అంజలి లు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story