Mahabubabad: పెద్దలు సక్రమ మార్గంలో నడిస్తేనే పిల్లలు ఆచరిస్తారు ఎస్పీ
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడులో ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం. గంజాయి రహిత గ్రామాలుగా మార్చాలని పిలుపు.
Mahabubabad: పెద్దలు సక్రమ మార్గంలో నడిస్తేనే పిల్లలు ఆచరిస్తారు ఎస్పీ
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు సర్పంచ్ గూగులోతు మనీ అధ్యక్షతన అరైవ్ అలైవ్ కార్యక్రమంను నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో నేటి యువత మద్యానికి, గాంజాకి , హెల్మెట్ లేని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమ బ్రతుకులను చిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు, ఏర్పాట్లు,గాంజా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో 54 పంచాయతీలను ఆదర్శంగా తీసుకొని వారు ఆచరిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరు తమ వాహనం తో హెల్మెట్ తప్పని సరిగా భావించి ,ప్రతి ఒక్కరు విధిగా తమ ప్రయాణాన్ని సుఖ వంతంగా కొనసాగించాలని కోరారు. ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా గ్రామస్తులకు గాంజా హెల్మెట్ లేని అవగాహనా కల్పించారు.మన ఊరు- మన బాధ్యత, నేను సైతం అంటూ బ్యానర్ పై ఫ్లెక్సీ పై జిల్లా ఎస్పీ ఆటోగ్రాఫ్ చేశారు. దీనిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో యువత మరికొందరు ఫ్లెక్సీ పై ఆటోగ్రఫీ చేశారు. గాంజా టెస్టింగ్ కిట్ల ద్వారా ఐదు నిమిషాలలో గంజాయి సేవించే వారిని గుర్తించే అధునాతన టెక్నాలజీ వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ఎస్పీ చేతుల మీదుగా సర్పంచ్ హెల్మెట్లను టు వీలర్ వాహనదారులకు పంపిణీ చేశారు.
డిఎస్పి తిరుపతిరావు మాట్లాడుతూ
సీసీ కెమెరాలు ఉంటే ఆ గ్రామంలో నేరం చేయాలంటే భయపడతారని ,ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేర రహిత గ్రామాలుగా చేసుకోవాలని గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉంటే ,సాధించలేనిది లేదని గుర్తు చేశారు. అందరూ బాగుండాలని జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఎన్నుకొని ప్రతి గ్రామంలో ఎవర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐ రవీందర్ ,ఎస్సై ప్రశాంత్ బాబు, సంతులాల్ పోడు తండ ఉప సర్పంచ్ కిషోర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




