Gudur: మహబూబాబాద్ జిల్లాలో ‘అరైవ్ అలైవ్’.. గూడూరులో హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్పీ శబరీష్!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో నిర్వహించిన "ప్రజా పాలన - అరైవ్ అలైవ్" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్ పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR
Published on: 10 Jun 2026 3:43 PM IST
Gudur
X

Gudur: మహబూబాబాద్ జిల్లాలో ‘అరైవ్ అలైవ్’.. గూడూరులో హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్పీ శబరీష్!

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామపంచాయతీలో నిర్వహించిన "ప్రజా పాలన - అరైవ్ అలైవ్" (Arrive Alive) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని, హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను కోల్పోవద్దని ఆయన హితవు పలికారు.

గ్రామ సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ:

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా, ఎస్పీ శబరీష్ గ్రామపంచాయతీ సిబ్బందికి స్వయంగా హెల్మెట్లను అందజేశారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తూ నియమాలను పాటించాలని కోరారు. హెల్మెట్ ధరించడంలో వివిధ గ్రామానికి చెందిన సర్పంచులు ప్రధాన పాత్ర పోషించి హెల్మెట్ ధరించాలని ఎలిమెంట్ ధరిస్తున్న గ్రామముగా ఉండాలని అన్నారు. గ్రామాలలో మండలాలలో గంజాయి విక్రయిస్తున్న వారి సమాచారం ఇస్తే వారికి తగిన బహుమతి అందిస్తామని గ్రామ సర్పంచ్లను కోరారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగ భవాని, ఎంపీడీవో సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ సునీత కొమ్మలు నాయక్, సిఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్, అటవీ శాఖ అధికారి ప్రసాద్ రావు, సిడిపిఓ నీలిమ, ఉప సర్పంచ్ చంటి స్వామి,

ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story