Gudur: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తీగలవేణి విద్యార్థిని

Gudur: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన గూడూరు మండలం తీగలవేణి ZPHS విద్యార్థిని మిటపల్లి ప్రీతిక. అభినందించిన హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్.

B NARASIMHA, GUDUR
Published on: 16 July 2026 3:48 PM IST
Gudur
X

Gudur: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు తీగలవేణి విద్యార్థిని

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ZPHS తీగలవేణి పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని మిటపల్లి ప్రీతిక రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ S.A. ఫారూఖ్ గారు, P.D. గొల్లపూడి రాణి గార్లు తెలిపారు.

ఈ నెల 14న మహబూబాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన జిల్లాస్థాయి 14 సంవత్సరాల విభాగం ట్రయల్స్‌లో ఆమె మొదటి స్థానం సంపాదించింది. దీనితో, తేది 18/07/2026 న మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగబోయే తెలంగాణ రాష్ట్రస్థాయి మిడిల్ డిస్టెన్స్ మరియు లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది.

ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ S.A. ఫారూఖ్ గారు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ సర్పంచ్ శ్రీ ధారావత్ రాజు గార్లు ప్రత్యేకంగా అభినందించారు. ఇట్లు, ప్రధానోపాధ్యాయులు,Z.P.H.S. తీగలవేణి, గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story