Mahabubabad: రూల్స్ బ్రేక్ చేస్తే నడవదు.. వాహనాలు సీజ్ చేసిన పోలీసులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీఐ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 29 Jun 2026 4:03 PM IST
Mahabubabad
X

Mahabubabad: రూల్స్ బ్రేక్ చేస్తే నడవదు.. వాహనాలు సీజ్ చేసిన పోలీసులు!

Mahabubabad: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని , కార్ల లో ప్రయాణించే ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సిఐ రఘుపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో తన సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు.

నెంబర్ ప్లేట్ , ఆర్.సి , ఇన్సూరెన్స్ లేని సుమారు 50 వాహనాలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారి కి అప్పగించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ....అరైవ్ అలైవ్ కార్యక్రమం లో గ్రామ.. గ్రామం లో వీధి..వీధినా

ట్రాఫిక్ నియమ నిబంధనల పై ప్రజలకు అవగాహన కల్పించామని , ప్రతి వాహనదారుడు ఆర్.సి , ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ , పర్మిట్ కలిగి ఉండాలని లేని పక్షంలో వాహనాలను సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్.ఐ అరుణ్ కుమార్ , ఎస్.ఐ ఉమా, సిబ్బంది పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story