Mahabubabad: గిరిజన భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
Mahabubabad: మహబూబాబాద్ గిరిజన భవన్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Mahabubabad: గిరిజన భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు
మహబూబాబాద్: గిరిజన భవన్ యందు ఆయుష్ డిపార్ట్మెంట్ మహబూబాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగ ద్వారా ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,
మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, జిల్లా అధికారులు,పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణంలోని గిరిజన భవన్లో ఆయుష్ డిపార్ట్మెంట్ నోడల్ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగ వేడుకల్లో మహబూబాబాద్ శాసనసభ్యులు యోగ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం
"భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన కానుక యోగా. నిరంతర ఒత్తిడి, పరుగుల జీవితంలో శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది" అని పేర్కొన్నారు.వైద్యుడిగా నా పిలుపు, తాను ఒక వైద్యుడిగా చెపుతున్నానని, ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగా ద్వారా అడ్డుకట్ట వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కనీసం అరగంట సమయాన్ని యోగాసనాలు, ప్రాణాయామానికి కేటాయించాలని కోరారు.
యువతపై ప్రత్యేక దృష్టి
యువత శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని, విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది ఒక చక్కని మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ నియోజకవర్గం, జిల్లాలోని ప్రజలందరూ యోగాను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేయకుండా, నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకుని సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు.
చక్కని ఏర్పాట్లతో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆయుష్ శాఖ, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఉమా మురళి నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రథోడ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, జిల్లా క్రీడల అధికారిని జ్యోతి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్,జిల్లా అధికారులతో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దిలీప్, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు స్థానిక సేవా సంస్థలు, నోడల్ అధికారి డాక్టర్ పి కిరణ్ కుమార్, రవికుమార్, కన్వీనర్ శ్రవణ్ కుమార్, స్థానిక తహసిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్,వైద్యులు వసుంధర దేవి, సూర్యం ,పూజిత, యోగశిక్షకులు స్పందన, కమల్ సుందర్, రామకృష్ణ, వడ్డెబోయిన శ్రీనివాస్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




