Mahabubabad: మహబూబాబాద్‌లో సెంట్రల్ లైటింగ్ లేక మహిళల తీవ్ర ఇబ్బందులు!
Mahabubabad: మహబూబాబాద్‌లో సెంట్రల్ లైటింగ్ లేక సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం.
Mahabubabad: మహబూబాబాద్‌లో సెంట్రల్ లైటింగ్ లేక మహిళల తీవ్ర ఇబ్బందులు!
Mahabubabad: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ చాలా పెద్ద పండుగ ఈ పండుగ రోజు మహిళలు ముస్తాబై బతుకమ్మలను తయారు చేసుకొని పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం లో పెట్టి బతుకమ్మ సంబరాలు జరుపుకున్న అనంతరం నిజాం చెరువులో నిమజ్జనం చేసే ఆనవాయితీ అయితే బస్టాండ్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వాహనాలు వస్తూ పోవడంతో ఏమైనా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని అలాగే మహిళలు ధరించిన ఆభరణాలు దొంగతనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని మున్సిపల్ అధికారులు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై మహిళలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ ను అడిగినప్పటికీ ఎటువంటి సమాధానం చెప్పకపోవడం దాటేయడం జరిగిందని ఇలా చేయడం వల్ల ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దీనికి బాధ్యత ఎవరు ఇస్తారని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా పోవడం ఎంతవరకు సమంజసమని మానుకోట పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో అట్టహాసంగా చేసుకుందామనుకున్న మహిళలను నిరాశపరిచినట్లయితే కమిషనర్ మున్సిపల్ పాలకమండలి కాంట్రాక్టర్ తమ విధులను సరిగా నిర్వర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.




