Mahabubnagar: భక్తిశ్రద్ధలతో కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం

Mahabubnagar: చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డేమాన్‌లో కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో దేవరకద్ర ఎమ్మెల్యే పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 16 Nov 2026 7:43 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: భక్తిశ్రద్ధలతో కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం

మహబూబ్ నగర్: చిన్న చింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి వారి ఉద్దాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఈ పవిత్ర మహోత్సవానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరై, స్వామివారి పాదుకలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, దేవరకద్ర నియోజకవర్గం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురుమూర్తి స్వామి వారి ఉద్దాల మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA