Mahabubnagar: తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ ఫైర్!

Mahabubnagar: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్రంగా ఖండించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Updated on: 13 Oct 2026 2:18 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ ఫైర్!

మహబూబ్ నగర్: కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్గాలు అంతే ఘాటుగా సమాధానమిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న ఇతరులపై విమర్శలు చేసే ముందు, తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి సమీక్షించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ తీవ్ర స్థాయిలో హితవు పలికారు.

ఇతర నాయకులను వేలెత్తి చూపించే ముందు, గతంలో తాను తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, మారిన పార్టీలపై మల్లన్న ప్రజలకు జవాబు చెప్పాలని సిరాజ్ ఖాద్రీ డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో చోటుచేసుకున్న వివాదం వెనుక ఉన్న అసలు వాస్తవాలను బయటపెట్టాలని సూచించారు.

​ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని విమర్శించే అర్హత మల్లన్నకు లేదన్న ఖాద్రీ.. రాజకీయాల్లో మాటకూ, చేతకూ పొంతన ఉండాలని, విమర్శలు చేసే ప్రతి నాయకుడూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.