Hanamkonda: హంటర్ రోడ్‌లో కలకలం.. భూమి అమ్మితే పైసలు ఇవ్వకుండా టార్చర్

Hanamkonda: హనుమకొండ హంటర్ రోడ్ దుర్గ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 Jun 2026 4:50 PM IST
Hanamkonda
X

Hanamkonda: హంటర్ రోడ్‌లో కలకలం.. భూమి అమ్మితే పైసలు ఇవ్వకుండా టార్చర్

హనుమకొండ: హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటద్రి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తన వద్ద భూమి కొనుగోలు చేసిన రవీందర్ రావు అనే వ్యక్తి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించాడు.

పలుమార్లు డబ్బులు అడిగినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story