Rayaparthi: భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు!

Rayaparthi: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్‌‌పల్లి శివారులో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో 33కేవీ విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు భూక్య రవి.

P ASHOK, WARDHANNAPET
Published on: 5 Oct 2026 4:11 PM IST
Rayaparthi
X

Rayaparthi: భార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు!

Rayaparthi: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్ పల్లి గ్రామ శివారులో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు 33kvవిద్యుత్‌ ప్రసార టవర్‌ ఎక్కి ఆందోళన చేపట్టడు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామం నరసింగపురం తండాకు చెందిన భూక్య రవి, రాయపర్తి మండలం జింకురామ్‌ తండాకు చెందిన బద్రిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

వీరికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు.కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో బద్రి పుట్టింటి వద్ద ఉంటోంది. ఆమె కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన రవి కొలనుపల్లి శివారులోని 33 కేవీ విద్యుత్‌ ప్రసార టవర్‌ ఎక్కి 2 గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు .సమాచారం అందుకున్న రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు.

సుమారు రెండు గంటలపాటు రవితో ఫోన్‌లో మాట్లాడి, సర్దిచెప్పి కిందకు దిగేలా చేశారు. దీంతో రవి సురక్షితంగా విద్యుత్‌ ప్రసార టవర్‌ నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కుటుంబసభ్యులు, తండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET