Warangal: 22-ఏ భూముల వివాదంపై బీఆర్ఎస్ చేస్తున్నది దుష్ప్రచారమే!

Warangal: వరంగల్‌లో మీడియా ఇంచార్జ్ మానవతా రాయ్ ప్రెస్ మీట్. 22-ఏ నిషేధిత జాబితా భూముల అంశంపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన కాంగ్రెస్ శ్రేణులు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 19 Sept 2026 12:24 PM IST
Warangal
X

Warangal: 22-ఏ భూముల వివాదంపై బీఆర్ఎస్ చేస్తున్నది దుష్ప్రచారమే!

Warangal: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్, హనుమకొండ జిల్లాల మీడియా ఇంచార్జ్ మానవతా రాయ్ మీడియా సమావేశం ఏర్పాటు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, ఇనగాల వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు.

మానవతారాయ్ కామెంట్స్:

22- A నిషేధిత జాబితాలో భూముల పై బిఆర్ఎస్ నేతలు ప్రజల్లో అనేక అపోహలు సృష్టించారు. కోటి ఎకరాల ప్రజల భూములు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ నిషేధిత జాబితాలో పెట్టినట్లు బిఆర్ఎస్ నేతలు విషప్రచారం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, జగదీశ్వర రెడ్డి, గంగుల కమలాకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మైహోమ్ రామేశ్వర్ రావు ల భూ ఆక్రమణ బట్టలు ఇప్పారు.

బిఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. 22-A నిషేధిత జాబితాలో భూముల పట్ల ప్రజలకి సంపూర్ణ అవగాహన కలిగించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబాన్ని బోనులో బంధించారు.

బిఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ కి రాకుండా తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని రేవంత్ వ్యూహంలో వాళ్ళు చిక్కుకుపోయారు. ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఒక కోటి రెండు లక్షల (1,02,00,000) ఎకరాలు ఉంది. ఇందులో మూడు లక్షల డెబ్బై మూడువేల (3,73,000) ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది

తొంభై ఎనిమిది లక్షల ముప్పయి ఒక్క వేల ఎకరాలు (98,31,000) ఎకరాలు భూములు శాశ్వతంగా నిషేధిత జాబితాలో ఉంటాయి. నిషేధిత జాబితాలో భూముల సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉంది. కెసిఆర్ పదేళ్ళ పాలనలో కూడా ఉంది.

ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితాలో (22-A) లో పొరపాటున చేరిన ప్రైవేటు భూములను సరిదిద్దడానికి సిసిఎల్ఎ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) విసి మనోరంజన్ పేరుతో 3-11-2022 న సిఎంఆర్జీ-3691 -2022 సర్క్యులర్ విడుదల చేసారు.

అధికారం పోయాక 22-A గురించి ఏమి విరగనట్లు రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ నేతలు. 22-A కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించినట్లు రుష్ప్రచారం చేశారు.

22-A జాబితా లో మార్పులు చేయాలని హైకోర్టు ఆదేశించగా కలెక్టర్లు పొరపాటును పాత జాబితానే తిరిగి పొందుపర్చారు. దీంతో సమస్య ఉత్పన్నం అయింది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరింది

పొరపాటును గ్రహించిన రెవిన్యూ మంత్రి పొంగులేటి రెవెన్యూ అధికారులు తప్పు సరిచేస్తామని ప్రకటించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పిర్యాదులు నమోదు చేశారు. మొత్తం 980 పిర్యాదులు అందాయి.

పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు వ్యక్తుల భూములను 15 రోజుల్లో పరిష్కారం చూపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిజంగా ఇది అందరి సమస్య కాదు. అధికారంలో ఉన్నప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను కొట్టేసిన బిఆర్ఎస్ నాయకుల సమస్య. ఇది కోట్లాది మంది సమస్యగా బిఆర్ఎస్ నేతలు చిత్రీకరించి దొంగనాటకాలాడారు.

2004 వరుకు ఎకరం లేని కెసిఆర్ కుటుంబ సభ్యులకు 2026 కల్లా 9 జిల్లాలు,24 మండలాల్లో 31 గ్రామాల్లో 439.30 ఎట్లా వచ్చాయే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. కెటిఆర్ కుమారుడు హిమాన్షు కు 46 ఎకరాలు మేజర్ అయిన కొద్దిరోజుల్లో ఎట్లా సంపాదించాడో కెటిఆర్ సమాధానం చెప్పాలి.

కెసిఆర్ కుటుంబం మరియు బిఆర్ఎస్ నాయకుల భూముల బాగోతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట పెట్టాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 175 ఎకరాలు భూములు ఉన్నాయని బిఆర్ఎస్ నాయకులు నష్ట నివారణ కోసం తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరం కెసిఆర్ తన ఫాంహౌస్ లో కలుపుకున్న ప్రభుత్వ భూములను శుద్ధితో అవమానించిన దళితులకు పంచాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందనీయం.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST