Mahabubabad: మరిపెడలో ఘనంగా సైకిల్ ర్యాలీ.. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!
Mahabubabad: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో అమరుల త్యాగాలను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
Mahabubabad: మరిపెడలో ఘనంగా సైకిల్ ర్యాలీ.. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మరిపెడ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ ర్యాలీ చేపట్టారు.
పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందించారు. అమరవీరుల త్యాగాలు వృథా కావని, వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్, మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్, చిన్నగూడూరు ఎస్ఐ మైబూబీ, ఎస్ఐ కుశకుమార్తో పాటు పోలీస్ సిబ్బంది, మరిపెడ పట్టణ స్థానికులు పాల్గొన్నారు.




