Mahabubabad: పేదల ఇంట ఆనందం.. ఇందిరమ్మ ఇండ్లలో అడుగుపెట్టిన లబ్ధిదారులు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా చిన్ననాగారం గ్రామంలో 23 ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Mahabubabad: పేదల ఇంట ఆనందం.. ఇందిరమ్మ ఇండ్లలో అడుగుపెట్టిన లబ్ధిదారులు!
Mahabubabad: తెలంగాణ రాష్ట్రం లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కిందని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం లో ఎం.పి బలరాం నాయక్ , ఎమ్మెల్యే మురళీ నాయక్ లు పాల్గొన్నారు. గ్రామం లో 31 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 23 ఇండ్లు పూర్తి కావడంతో వారంతా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ, ప్రతి ఇందిరమ్మ ఇంటికి కేంద్రం 70 వేల రూపాయలు ఇస్తున్నా, మిగతావి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, విద్యార్థులకు కాస్మో టిక్ చార్జీలను పెంచామన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




