Kesamudram: కేసముద్రంలో ఘోర అగ్నిప్రమాదం.. బూడిదైన రైతన్న పంట!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని అర్పనపల్లి, కోరుకొండపల్లి గ్రామాల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం.
Kesamudram: కేసముద్రంలో ఘోర అగ్నిప్రమాదం.. బూడిదైన రైతన్న పంట!
Kesamudram: కేసముద్రం మండలం లోని అర్పనపల్లి , కోరుకొండపల్లి గ్రామాలల్లో జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో పలువురు రైతులు పంట పొలాల్లో ఆరబెట్టిన వరి , మిర్చి పంటలు , వరి గడ్డి దగ్గమై సుమారు 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది.అర్పనపల్లి గ్రామం లో కుమారస్వామి అనే రైతు పొలంలో ఆరబెట్టిన 10 క్వింటాళ్ల మిర్చి , వరి ధాన్యం, సాగు నీటి పైపులు కాలి బూడిదైయ్యాయి.
కోరుకొండపల్లి లో గ్రామ శివారు లో జరిగిన మరో అగ్ని ప్రమాదం లో యాకయ్య , నరసయ్య రైతు లకు చెందిన వరి ధాన్యం పొలంలో ఆరబెట్టగా మంటల్లో కాలి బూడిదైంది. సుమారు 50 మంది రైతుల చెందిన 900 వరి గడ్డి కట్ట లు అగ్ని కి ఆహుతయ్యాయి.
గ్రామస్తులు వెంటనే స్పంధించి స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న నీళ్ల ట్యాంకరుతో మంటలను ఆర్పివేయడంతో భారి ప్రమాదం తప్పింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు బోరున విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. వేసవి కాలం లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు , వేడి గాలుల భారీ అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం వరి కోతలు పూర్తవుతున్న నేపథ్యం లో పొలాల్లో గడ్డి , ఎండిన పంట అవశేషాలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.




