Guduru: ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ

Guduru: ఆరు గ్యారంటీ హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ గూడూరులో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినతిపత్రం సమర్పించారు.

B NARASIMHA, GUDUR
Published on: 30 Sept 2026 4:21 PM IST
Guduru
X

Guduru: ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ

గూడూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) - ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గూడూరు తహసీల్దార్ నాగభవనీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు పానుగంటి నర్సయ్య, కేంద్ర కమిటీ సభ్యులు నూకల ఉపేందర్ మాట్లాడుతూ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. అయితే పాలన ప్రారంభమై రెండు సంవత్సరాల పది నెలలు గడుస్తున్నా, ఒకటి రెండు హామీలు మినహా మిగిలిన గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదని, తీవ్ర ఆర్థిక ఆందోళనతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, నిలువ నీడ లేక అరవై గజాల ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని నిలబెట్టుకోకుండా, పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు.

ఎంసిపిఐ (యు) ప్రధాన డిమాండ్లు:

ఆరు గ్యారంటీల హామీలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాలకు ఇస్తున్న పింఛన్‌ను రూ. 2000/- నుండి రూ. 4000/-కు, వికలాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ. 4000/- నుండి రూ. 6000/-కు దసరా పండుగ కానుకగా తక్షణమే పెంచి అందించాలి. మహిళలకు నెలకు రూ. 2500/- ఇస్తామన్న హామీని తక్షణమే అమలు చేయాలి.

వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000/- ఇస్తామన్న హామీని నెరవేర్చాలి. కౌలు రైతులకు సహాయం: కౌలు రైతులకు కూడా సంవత్సరానికి రూ. 12,000/- ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, నీరు, నిడ వంటి కనీస వసతులు కల్పిస్తూ సంక్షోభం లేని తెలంగాణను తీర్చిదిద్దాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బందుల వీరస్వామి, మండల కార్యదర్శి కటకం బుచ్చి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR