Jangaon: ఈ నెల 27న జనగామలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన: కలెక్టర్!
Jangaon: ఈ నెల 27న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జనగామ జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
Jangaon: ఈ నెల 27న జనగామలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన: కలెక్టర్!
జనగామ జిల్లా: ఈ నెల 27న జనగామ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవాలకు సర్వం సిద్ధం చేయాలి సుమారు రూ.154 కోట్లతో నిర్మించిన అత్యాధునిక వైద్య భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి వైద్య కళాశాల విద్యార్థులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి విద్యార్థుల వసతి గృహాలు, కళాశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి.
విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.




